Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ '1.. నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు కృతి సనన్ పరిచయం అయ్యింది. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ నాగచైతన్య 'దోచెరు' సినిమాలో నటించే ఆఫర్ దక్కించుకుంది. ఇది కూడా ప్రేక్షకుల నిరాదరణ పొందడంతో టాలీవుడ్‌ని వదిలేసి బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. తొలి సినిమా 'హీరోపంటి'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతి బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం 'మిమి', 'హమ్ దో హమారే దో', 'బచ్పన్ పాండే', 'భేడియా' వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటితోపాటు ఆమె రేంజ్‌ని పెంచబోయే పాన్ ఇండియా సినిమా 'ఆదిపురుష్'లో ప్రభాస్ సరసన మెరవబోతోంది. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే, టాలీవుడ్లో కృతి మరో ఆఫర్‌ని దక్కించుకుందని సమాచారం. విజరుదేవరకొండ, సుకుమార్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాలో కృతిని కథానాయికగా ఎంపిక చేశారని వినిపిస్తోంది. సుకుమార్ '1.. నేనొక్కడినే'లో కృతి నటించిన విషయం విదితమే. మరోమారు ఈ కాంబో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోందన్నమాట.