Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న 'మనం సైతం' కరోనా కష్ట కాలంలో ఎంతోమందిని ఆదుకుంది. ఆపదలో ఉన్న పేదలకు ఆర్థికసాయం అందిస్తూనే, నిత్యావసర వస్తువులనూ అందించింది. తాజాగా చిత్రపురి కాలనీ ఐసోలేషన్లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు ఊచితంగా భోజన సదుపాయం, మందుల కిట్, పీపీఈ కిట్, మాస్క్, శానిటైజర్, ఇమ్యూనిటీ పొడి, ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకొనేందుకు ఆక్సీమీటర్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమానికి చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, రుద్రరాజు రమేష్, ఆయన టీమ్ సభ్యులు చేయూత అందించారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ, 'కరోనా టైమ్లో మా సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం చిత్ర పురి కాలనీలో కోవిడ్ పేషెంట్లకు సహాయం చేసేందుకు ముందుకొచ్చాం. కరోనా వచ్చిన వారి వల్ల మిగతా వారు ఇబ్బంది పడకూడదని మేం ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నాం' అని అన్నారు.