Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి మా జీవితాలతో దారుణంగా ఆడుకుంటోంది. సెకండ్ వేవ్ ఉధతంగా ఉందని షూటింగ్లు ఆపేశారు. కుటుంబ పోషణ కోసం ఏదో దొరికిన పని చేస్తున్నాం. లాక్డౌన్ కారణంగా ఇప్పుడు ఆ పని కూడా పోయింది. ఇక మేం బతికేది ఎట్లా...?, ఆదుకునేవారు లేక అల్లాడిపోతున్నాం.. అని సినీ కార్మికులు కన్నీంటి పర్యంతం అవుతున్నారు.
సినీ కార్మికుల కుటుంబాల్లోనూ కరోనా పాజిటివ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే వీళ్ళలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఒకేరోజు ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు చనిపోయిన హదయ విదారక సందర్భాలూ అనేకం ఉన్నాయి. ఈ మహమ్మారి నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి మరికొంత మంది ఉన్నదంతా ఆస్పత్రుల దోసిట్లో పోసి..అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారు.
ఓ పక్క కరోనాతో పోరాటం చేస్తూ.. మరో పక్క బతుకుబండిని నడిపించే క్రమంలో సినీ కార్మికులు నరకాన్ని చూస్తున్నారు. ప్రభుత్వాలు, పాలకులు.. సినీ పెద్దలు.. ఎవరి నుంచైనా సాయం అందుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో మేమున్నామని కొంత మంది అండగా నిలుస్తున్నారు.
జూనియర్ ఆర్టిస్టులకు నిత్యావసర సరుకులు
తెలుగు చిత్ర పరిశ్రమతోపాటు టెలివిజన్ రంగానికి చెందిన దాదాపు 200కి పైగా జూనియర్ ఆర్టిస్టులకు ఆదివారం కష్ణా నగర్లో 'జీ టీవీ - ఓంకారం' దేవి శ్రీ గురూజీ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,' తెలుగు సినీ ఇండిస్టీ, టీవీ ఆర్టిస్టులు ఈ కరోనా కష్ట కాలంలో పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళని మనం సినిమాల్లో, టీవీల్లో చూసి మనం చాలా ఆనందిస్తాం. అలాంటిది వాళ్ళు ఇలాంటి ఇబ్బందులలో ఉండటం చూసి నాకు చాలా బాధ కలిగింది. అందుకే నా వంతు సాయంగా నిత్యావసర సరుకులు అందచేస్తున్నాను. ఇప్పుడు రెండు వందల మందికి అంద చేస్తున్నాం. కరోనా పరిస్థితులు దష్ట్యా ఎక్కువ జనం గుమికూడదు కాబట్టి, మూడు రోజులకి ఒకసారి మిగిలిన వారందరికీ అందచేస్తాం' అని చెప్పారు. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ స్వామి గౌడ్ మాట్లాడుతూ,'కరోనా ఫస్ట్ వేవ్ టైమ్లో కూడా గురూజీ చాలా మందికి సహాయం చేశారు. మేము అడగ్గానే పెద్ద మనసుతో ఆయన ముందుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం' అని చెప్పారు.
యూనియన్ సెక్రటరీ వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ, 'తెలుగు సినీ ఇండిస్టీ జూనియర్ ఆర్టిస్టులకు , అలాగే టీవీ ఆర్టిస్టులకు రైస్ బ్యాగ్, కంది పప్పు, ఆయిల్ ప్యాకెట్, ఇంక నెలకు సరిపడా వంట సామాగ్రిని కరోనా కష్ట కాలంలో గురూజీ పంపిణి చేయటం ఆనందంగా ఉంది' అని తెలిపారు.