Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి వల్ల అయినవాళ్ళని పోగొట్టుకుని ఎంతోమంది విలవిల్లాడిపోతున్నారు. సీరియస్ కేసుల విషయంలో ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్స్ దొరక్క ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇదే కారణంతో 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్ర దర్శకుడు సుబ్బు తన తల్లిని కోల్పోయారు. కరోనా పాజిటివ్‌తో శ్వాసకి సంబంధించిన ఇబ్బంది తలెత్తడంతో, ఐసియూలో బెడ్ కోసం చేసిన ప్రయత్నంలో విఫలమవ్వడంతో ఆమె కన్నుమూశారు. 'కొన్ని రోజులుగా కరోనాతో ఇబ్బంది పడుతున్న సుబ్బు తల్లి మంగమ్మకి ఐసీయూ బెడ్ దొరక్క తుదిశ్వాస విడిచారు. ఎంతగా ప్రయత్నించినప్పటికీ సుబ్బు తల్లిని కాపాడుకోలేకపోయాం. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత తెరుచుకున్న థియేటర్లలోకి మొట్టమొదటిగా తన చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'ని విడుదల చేసి టాలీవుడ్‌కి ధైర్యాన్నిచ్చిన సుబ్బుకి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి రావడం బాధాకరం' అని హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.