Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో ఇంజనీరింగ్ కాలేజీ నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ 'రూమ్ నెంబర్ 54'. జీ5లో ఎక్స్‌క్లూజివ్‌గా ఈనెల 21న స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, 'మీరందరూ ఇంట్లో కూర్చుని కాలేజ్ మిస్ అవుతున్నారని నాకు తెలుసు. నేనూ నా కాలేజ్ మిస్ అవుతున్నాను. ముఖ్యంగా, బ్యాక్ బెంచ్ గ్రూప్ ఉంది కదా! వాళ్ళు అయితే తప్పకుండా మిస్ అవుతారు. కాలేజ్ మెమరీస్ జీవితాంతం గుర్తుంటాయి. ఈ కరోనా సమయంలో, ఎవరికి వారు సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్న ఈ వేళలో మీ కోసం, మీ కాలేజ్ మెమరీస్ గుర్తు చేయడం కోసం 'రూమ్ నంబర్ 54'ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. నూతన దర్శకుడు సిద్ధార్థ్ గౌతమ్ రచన, దర్శకత్వంలో రూపొందిన దీన్ని ఐడ్రీమ్ మీడియా ప్రొడ్యూస్ చేసింది. ప్రతి ఎపిసోడ్లో మిమ్మల్ని మీరు మీరు చూసుకుంటారు. మీ స్నేహితుల్ని గుర్తు చేసుకుంటారు' అని తెలిపారు. 'ఇంజనీరింగ్ చదువుతూ కాలేజీ హాస్టల్లోని రూమ్ నంబర్ 54లో ఉంటున్న నలుగురు కుర్రాళ్ల కథ ఇది. ఆ రూమ్‌కి ఓ ప్రత్యేకత ఉంది. అందులో ఉన్న వారందరికీ నెక్స్ట్ బ్యాచ్‌లతో ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. ఆ రూమ్‌లో దిగిన నలుగురు మిడిల్ క్లాస్ కుర్రాళ్ళకు ఎటువంటి సవాళ్ళు ఎదురయ్యాయి?, వాటిని ఎలా అధిగమించారు? అనేది మిగతా కథ' అని మేకర్స్ తెలిపారు.