Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత 'స్రవంతి' రవికిశోర్, హీరో రామ్ ఇంట విషాదం చోటు చేసుకుంది.
రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సుబ్బారావు అనారోగ్య సమస్యలతో మంగళవారం ఉదయం విజయవాడలో తుదిశ్వాస విడిచారు.
ఆయన వయసు 91 సంవత్సరాలు. తాతయ్య మరణంతో రామ్ భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం ఈస్థాయికి రావడం వెనుక తాతయ్య కషి, శ్రమను ఆయన గుర్తు చేసుకున్నారు. 'తాతయ్య... మీది రాజులాంటి మనసు. విజయవాడలో లారీ డ్రైవర్గా జీవితం ప్రారంభించిన మీరు కుటుంబానికి అన్ని వసతులు, సౌకర్యాలు అందించడం కోసం ఆహర్శిశలు శ్రమించారు. మన దగ్గర ఉన్న సంపదను బట్టి ఎవరూ శ్రీమంతులు కారని, మంచి మనసు ఉన్నవాళ్లు శ్రీమంతులు అవుతారని మీరు మాకు నేర్పించారు. మీ పిల్లలు అందరూ ఇవాళ ఉన్నతస్థాయిలో ఉన్నారంటే, అందుకు కారణం మీరే. ఉన్నత కలలు కనడంతో పాటు సాకారం చేసుకునేలా వాళ్లను ప్రోత్సహించారు' అని రామ్ కన్నీటి పర్యంతమయ్యారు. 'స్రవంతి' రవికిశోర్ సోదరుడు మురళి తనయుడు రామ్ అనే సంగతి తెలిసిందే. -