Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీను సునీల్ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'తెర కోసం వేషాలు'. 'వి' ప్రొడక్షన్ హౌస్ సంస్థ నిర్మాణ సారధ్యంలో మనోజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీను సునీల్ మాట్లాడుతూ, 'జీవన్ రెడ్డి చెప్పిన కథ చాలా బాగుంది. షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాల్లో నటించి, తెరపై తమని తాము చూసుకోవాలని, సినీరంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని కొందరు యువకులు చేసే ప్రయత్నమే మా సినిమా కథ. అయితే ఆ యువకులకు కరోనా ఎలాంటి సమస్యలు తెచ్చింది?, వాళ్ళు వాటిని ఎలా ఫేస్ చేశారో తెలియాలంటే మా సినిమాని చూడాల్సిందే. మంచి బడ్జెట్‌తో ఎక్కడా రాజీపడకుండా క్వాలిటీతో నిర్మించాం. ఈ వారంలోనే ప్రొమోషనల్ సాంగ్‌ని రిలీజ్ చేస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యాక సాధ్యమైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. మంచి కంటెంట్‌తో రూపొందుతున్న మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం : వి.ఆర్.ఏ.ప్రదీప్, కెమెరా : క్రాంతి, ఎడిటింగ్ :సత్య, సౌండ్ ఎఫెక్ట్స్ : వెంకట్, డైరెక్టర్ : మనోజ్ కుమార్ శంభు, నిర్మాత : శ్రీను సునీల్.