Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరోగ్య పరంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ నటి
పావలా శ్యామలకు చిరు మరోసారి సాయం చేశారు. గతంలో రూ.2 లక్షలను ఇచ్చి ఆదుకున్న ఆయన ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుంచి నెల, నెలా 6 వేల రూపాయల ఫించన్ వచ్చేలా ఏర్పాటు చేశారు. దీని కోసం ఆమెను 'మా' సభ్యురాలిగా చేర్చటం కోసం అవసరమైన సభ్యత్వ ఫీజు 1,01,500 రూపాయలను చెక్ రూపంలో అందజేశారు.