Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడవి నేపథ్య చిత్రాల్లో సరికొత్త ప్రయత్నంగా తెరపైకి రాబోతున్న సినిమా 'నల్లమల'. నల్లమల అటవీ ప్రాంతంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రవి చరణ్ రూపొందించారు. అమిత్ తివారీ, భానుశ్రీ, తనికెళ్ల భరణి, అజరు ఘోష్ ముఖ్య పాత్రల్లో నటించారు. మరో కీలక పాత్రని నాజర్ పోషించారు. ఈ సినిమాలో అసాధారణ మేధస్సు ఉన్న సైంటిస్ట్‌గా నాజర్ కనిపించబోతున్నారు. ఆయన పాత్ర లుక్‌ను చిత్ర బృందం సోమవారం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా నాజర్ క్యారెక్టర్ గురించి దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ,'ఇరాన్ దేశంలో నివసించే తెలుగువాడైన సైంటిస్ట్ పాత్రను నాజర్ పోషించారు. అతని మేధస్సు అపారమైనది. ప్రపంచాన్ని శాసించే శక్తి తన పరిశోధనలకు ఉండాలన్నది నాజర్ పాత్ర లక్ష్యం. అందుకు తానేం తయారు చేయాలి అనేది నిరంతరం ఆలోచనలు చేస్తుంటాడు. ఆ ప్రయోగం మంచిదా?, చెడ్డదా అనేది అతనికి అనవసరం. తన ప్రయోగాలకు నల్లమలను క్షేత్రంగా ఎంచుకుని, అక్కడ ఏం ప్రయోగాలు చేశాడు?, ఏం కనుగొన్నాడు?, ఆ ప్రయోగాల ఫలితంగా ఏం జరిగింది అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటుంది' అని చెప్పారు. కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, చలాకీ చంటి, ముక్కు అవినాష్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : శివ సర్వాణి, ఫైట్స్ : నబా, విఎఫ్ఎక్స్ : విజరు రాజ్, ఆర్ట్ : యాదగిరి, సినిమాటోగ్రఫీ : వేణు మురళి, సంగీతం, పాటలు : పి.ఆర్, నిర్మాత : ఆర్.ఎమ్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రవి చరణ్.