Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిజిటల్ ఫ్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇస్తూ కథానాయిక సమంత నటిస్తున్న వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకే పరిమితమైన సమంత ఈ వెబ్ సిరీస్‌తో తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ బుధవారం రిలీజ్ చేశారు. ఇందులో డీ గ్లామర్‌గా సమంత కనిపించిన తీరు, నటించిన నేపథ్యం.. మాట్లాడే వైనం..ఆమె బాడీ లాంగ్వేజ్.. 'వాళ్లందర్నీ నేను చంపేస్తా' అంటూ ఆవేశపూరితంగా చెప్పే డైలాగ్స్.. ఇవన్నీ ఈ వెబ్సిరీస్ని ఎప్పుడెప్పుడు చూడాలా అనేంతగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రాజీ అనే ఉగ్రవాదిగా గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో సమంత లుక్ వండర్ఫుల్ అంటూ నెటిజన్లు కితాబివ్వడం విశేషం. గత సీజన్ మాదిరిగానే శ్రీకాంత్ తివారీ పాత్రలో మనోజ్ బాజ్పారు ఆకట్టుకున్నారు. ఉగ్రవాది రాజీ కుట్రలను భగం చేసి, ఆమెను అరెస్ట్ చేయడానికి శ్రీకాంత్ ఏ విధమైన ప్రయత్నాలు చేశాడు అనేది ఈ వెబ్‌సిరీస్ ముఖ్య ఇతివృత్తం. వెబ్ సిరీస్‌ల్లోనే విశేష ఆదరణ పొందిన 'ది ఫ్యామిలీ మ్యాన్'కి సీక్వెల్‌గా 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'ని రూపొందించారు. ప్రియమణి కూడా ప్రధాన పాత్ర పోషించింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 4న ఈ కొత్త సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా సినిమా 'శాకుంతలం' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.