Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'లయన్' చిత్రంలో బాలకృష్ణ సరసన నటించిన త్రిష మరోసారి ఆయనకి జోడీగా మెరవబోతోందని సమాచారం. బాలకృష్ణ, మలినేని గోపీచంద్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం విదితమే. ఇందులో ఇప్పటికే ఓ కీలక పాత్రలో మీనాని ఎంపిక చేశారని వినిపిస్తోంది. అలాగే బాలయ్య సరసన కథానాయికగా త్రిషని తీసుకున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కథాపరంగా అటు మీనా, ఇటు త్రిష ఇద్దరి పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత బాలయ్యకి జోడిగా శ్రుతిహాసన్ని తీసుకున్నారనే వార్తలు వినిపించాయి. అయితే సీనియర్ హీరో సరసన నటిస్తే, ఇకపై తనకి అవకాశాలు రావనే ఉద్దేశంతో శ్రుతి ఈ ప్రాజెక్ట్‌ని సున్నితంగా తిరస్కరించినట్టు టాక్. ఇదిలా ఉంటే, బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను 'అఖండ' చిత్రంలో నటిస్తున్నారు. అలాగే 'పొన్నియన్ సెల్వన్', 'గర్జనై', 'శతురంగ వేట్లై2', 'రంగీ', 'రామ్' వంటి తదితర తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ త్రిష బిజీగా ఉంది.