Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్ బర్త్‌డేకి 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వబోతోంది. నేడు (గురువారం) ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఉదయం 10గంటలకు 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్ని విడుదల చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. అలాగే అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
సంబరాలు చేసుకునే సమయం కాదు
ఎన్టీఆర్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దాన్నుంచి కోలుకుంటున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలను నిర్వహించాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బుధవారం సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌కి ఓ విజ్జప్తి చేశారు. 'మీ అందరి ఆశీస్సులతో కోవిడ్‌ని జయిస్తాను. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా లాక్డౌన్, కర్ఫ్యూ నిబంధనలను పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. నా పుట్టినరోజును ఉద్దేశించి ప్రతి ఏటా ఎలా సెలెబ్రేట్ చేస్తారో తెలుసు. అయితే ఇది సంబరాలు చేసుకునే సమయం కాదు. దేశం మొత్తం కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తోంది. అందుకే ప్రతీ ఒక్కరూ ఫ్రంట్ లైన్ వారియర్స్ సహా వైద్యులకు బాసటగా నిలవండి. అలాగే ప్రతి ఒక్కరూ తమ కుటుంబాలని జాగ్రత్తగా చూసుకోండి. కరోనాను సమూలంగా జయించిన రోజున మనమంతా కలిసి వేడుక చేసుకుందాం' అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.