Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ విశ్వరూపానికి యావత్ భారతదేశం అతలాకుతలామైపోతోంది. ముఖ్యంగా ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని కోసమై దేశ వ్యాప్తంగా సెలబ్రిటీలందరూ తమవంతు సాయంగా, బాధ్యతగా కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ని అందించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా చిరంజీవి సైతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
బ్యాంక్ పర్యవేక్షణ బాధ్యతని రామ్‌చరణ్ నిర్వహిస్తారు. ఇందులో మెగా అభిమానులను కూడా భాగస్వాముల్ని చేయబోతున్నారు. ఆయా జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షులు అక్కడ వీటి నిర్వహణ బాధ్యత చూస్తారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉండటం కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ ఎకౌంట్‌ని కూడా ప్రారంభించారు. ఈ విషయాన్ని రామ్‌చరణ్ సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకున్నారు.
25 వేల మందికి నిత్యావసరాలు
కరోనా కష్టకాలంలో తన స్నేహితులు, అభిమానుల ప్రోత్సాహంతో 25వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు హీరో మంచు మనోజ్ తెలిపారు. గురువారం ఆయన పుట్టినరోజు.
'కోవిడ్ భాదితులు మెరుగైన ఆరోగ్యంతో కోలుకోవాలని, వారిలో సానుకూలమైన ఆలోచనలను పెంపొందాలని, వారి జీవితాల్లో తిరిగి సంతోషం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. తమ జీవితాలను, కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తో పాటుగా కోవిడ్ కట్టడిలో భాగస్వామ్యులైన అందరికీ కతజ్ఞతలు. మాస్కులు ధరించడం, ప్రతిరోజు శానిటైజ్ చేసుకోవడం, భౌతికదూరం పాటించడం.. ఇలా కోవిడ్ నియంత్రణ చర్యలను పాటించడం వల్లనే ఈ ప్రపంచం కోవిడ్ మహమ్మారి నుంచి భయటపడుతుంది. నా పుట్టినరోజు సందర్భంగా ఈ లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్న పాతికవేల కుటుంబాలకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాం' అని మనోజ్ సోషల్ మీడియా వేదికగా చెప్పారు.