Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గురువారం కథానాయకుడు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఇక బర్త్‌డే స్పెషల్ గిఫ్ట్స్‌తో ఎన్టీఆర్ అభిమానులతోపాటు ప్రేక్షకులు సైతం ఫుల్ ఖుషీ అయ్యారు.
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఓ సరికొత్త పోస్టర్‌తో 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం అందర్నీ మరోసారి మెస్మరైజ్ చేసింది. 'ఆర్ఆర్ఆర్' నుంచి ఓ సరికొత్త లుక్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. బల్లెం గురిపెట్టి పోరాటానికి సిద్ధమైనట్లు ఉన్న ఎన్టీఆర్ లుక్ పోస్టర్ ఎంతగానో ఆకర్షిస్తోంది.
'మా భీమ్ది బంగారంలాంటి మనస్సు. కానీ, ఆయనే కనుక తిరుగుబాటు చేస్తే బలం, ధైర్యంగా నిలుస్తాడు' అని దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.
పీరియాడిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రామ్‌చరణ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌ను రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్, రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ నాయిక ఆలియాభట్ సందడి చేయ బోతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం విదితమే. తాజాగా ఈ చిత్ర నిర్మాతలు ఎన్టీఆర్ బర్త్‌డే నేపథ్యంలో ఆయన న్యూ లుక్‌ను రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు. టక్‌తో క్లాసీగా ఉన్న ఎన్టీఆర్ లుక్ అదిరి పోయిందంటూ ఆయన అభిమానులు ట్వీట్ల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, నందమూరి కల్యాణ్‌రామ్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అలాగే బర్త్‌డే స్పెషల్‌గా ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశారు. 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ పాన్ ఇండియా సినిమాని ఎన్టీఆర్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. తన బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి, అలాగే తన మాటని గౌరవించి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్న అభిమానులకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.