Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు పూరీ జగన్నాథ్, కన్నడ స్టార్ యష్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో పూరీ చెప్పిన కథ యష్కి బాగా నచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కాంబోలో సినిమా దాదాపు ఖరారైనట్టేనట. 'కేజీఎఫ్'తో పాన్ ఇండియన్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్న యష్ ప్రస్తుతం 'కేజీఎఫ్2'తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే పూరీ ప్రస్తుతం విజరు దేవరకొండతో పాన్ ఇండియా సినిమా 'లైగర్'ని తెరకెక్కిస్తున్నారు.