Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మామూలు రోజుల్లో సినిమాలు ఎంత గ్రాండ్‌గా రిలీజ్ అవుతాయో అందరికీ తెలుసు. నేను కూడా 'రాధే' సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను.
ఎంతో కష్టపడి నటించిన చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లి, పండగలాంటి వాతావరణం మధ్య సినిమా విడుదలైతే
ఆ సంతప్తే వేరు' అని అంటోంది బాలీవుడ్ కథానాయిక దిశా పటాని.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా 'రాధే' సినిమా ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైంది. సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కలెక్షన్ల సునామీతో ఈ సినిమా
రికార్డ్ క్రియేట్ చేసింది. సల్మాన్‌ఖాన్, దిశాపటాని జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో
ఈ సినిమా రూపొందింది. ప్రేక్షకుల మాదిరిగానే తాను కూడా 'రాధే' సినిమాని థియేటర్లలో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అంటోంది దిశా.
'కరోనా విజృంభిస్తున్న ఇలాంటి కష్టతరమైన రోజుల్లో సినిమా విడుదల కావడమే గొప్ప విషయం. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇలాంటప్పుడు ఓటీటీనే చిత్ర పరిశ్రమని నడిపించే ఓ శక్తివంతమైన మార్గంగా కనిపిస్తోంది. ఎందరికో ఉపాధి కల్పిస్తోంది. కొవిడ్ సెకండ్ వేవ్ వల్ల ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లి సినిమాలు చూసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ ఓటీటీ ద్వారా
వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు' అని దిశా తెలిపింది.