Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్యా, ప్రేక్షకుల ఆరోగ్యమే ముఖ్యంగా భావించి మా చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయటం లేదు అని కొన్ని రోజుల క్రితం 'ఏక్ మినీ కథ' చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈనెల 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ పోస్టర్‌ను గురువారం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 'వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌ని మొదలు పెట్టారు. ఈ బ్యానర్లోనే 'ఏక్ మినీ కథ' సినిమా నిర్మాణం పూర్తయ్యింది. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్ లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా 'డజ్ సైజ్ మేటర్స్' అంటూ పోస్టర్లో ఉన్న మేటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 'పేపర్ బారు' సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. దర్శకుడు కార్తీక్ రాపోలు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిం చారు. అందరూ ఇంట్లోనే సేఫ్‌గా ఉంటూ మా చిత్రాన్ని చూడాలని ఆశిస్తున్నాం' అని చిత్ర యూనిట్ తెలిపింది.
సంతోష్ శోభన్, కావ్య తప్పర్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు.