Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెండితెరపై కథానాయికగా తానేంటో నిరూపించుకున్న తమన్నాకి డిటిజల్ ఫ్లాట్‌ఫామ్ మాత్రం సవాల్ విసురుతోంది. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది నటీనటులు ఓటీటీల కోసం పలు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా తమన్నా సైతం రెండు వెబ్ సిరీస్‌ల్లో నటించింది. కార్పొరేట్ కంపెనీ రాజకీయాల నేపథ్యంలో రూపొందిన 'లెవెన్త్ అవర్' ఇటీవల ఆహా ఓటీటీలో రిలీజైంది. అయితే ఆశించిన స్థాయిలో కథనం లేకపోయే సరికి నిరాదరణకు గురైంది. తొలి వెబ్‌సిరీస్ ఫ్లాప్ కావడంతో కథల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తమన్నాకి మరో పరాజయం తప్పలేదు. రెండో ప్రయత్నంగా నటించిన 'నవంబర్ స్టోరీస్' థ్రిల్లర్ వెబ్ సిరీస్ సైతం అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఇటీవల హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ వెబ్‌సిరీస్‌కి విశ్లేషకులు దారుణమైన రేటింగ్ ఇచ్చారు. మొత్తమ్మీద తమన్నా స్టార్డమ్ ఈ వెబ్ సిరీస్‌ల్ని సక్సెస్ చేయలేకపోయాయి. దీంతో తమన్నాతో మరిన్ని వెబ్ సిరీస్‌లు చేద్దామనుకుంటున్న మేకర్స్ ఇప్పుడు ఆలోచనలో పడ్డారు.