Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగీత ప్రపంచంలో ఓ సువర్ణాధ్యాయాన్ని సృష్టించిన ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు రామ్‌లక్ష్మణ్ (78) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో నాగ్‌పూర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
రామ్‌లక్ష్మణ్ అసలు పేరు విజరు పాటిల్. తన స్నేహితుడు రామ్‌తో కలిసి రామ్‌లక్ష్మణ్ పేరుతో సంగీత దర్శకులుగా మరాఠీ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ప్రముఖ మరాఠీ హాస్యనటుడు దాదా కోడ్‌కే ప్రోత్సాహంతో 'పండు హవాల్దార్' మరాఠీ చిత్రంతో రామ్‌లక్ష్మణ్‌ల సంగీత ప్రస్థానం ఆరంభమైంది. అయితే 1977లో తన స్నేహితుడు రామ్ 'ఏజెంట్ వినోద్' చిత్రంలోని పాట పాడిన తర్వాత చనిపోయారు. అప్పట్నుంచి విజరుపాటిలే రామ్‌లక్ష్మణ్‌గా సంగీత ప్రయాణాన్ని కొనసాగించారు.మన్మోహన్దేశారు, మహేష్‌భట్, జి.పి.సిప్పీ, అనీల్ గంగూలీ వంటి హేమాహేమీల చిత్రాలకు రామ్‌లక్ష్మణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 1981లో రవీంద్ర రావల్ 'హమ్ సే బడ్కర్ కౌన్' చిత్రంలోని 'దేవా ఓ దేవా గణపతి దేవా' పాటతో రామ్లక్ష్మణ్కి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత 'వో జో హసీనా', 'దీవానా తేరే నామ్ కా', 'ఆగే కీ సోచ్' వంటి తదితర చిత్రాలకు అందించిన సంగీతం రామ్లక్ష్మణ్ని బాలీవుడ్లో ప్రముఖ సంగీత దర్శకుణ్ణి చేశాయి.
మలుపుతిప్పిన 'మైనే ప్యార్ కియా'
ఆ తర్వాత దర్శకుడు సూరజ్ భర్జత్యా తెరకెక్కించిన 'మైనే ప్యార్ కియా' (1989) చిత్రంలోని సంగీతంతో రామ్‌లక్ష్మణ్ ఓ సంచలనం సృష్టించారు.
ఆ చిత్రంలోని పాటలు విశేష ఆదరణ పొంది ఎవర్గ్రీన్ సాంగ్స్‌గా నిలిచాయి. దీంతో రామ్‌లక్ష్మణ్ బాలీవుడ్లో తిరుగులేని సంగీత దర్శకుడిగా ఎదిగారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన 'హమ్ ఆప్కే హై కౌన్', 'హమ్ సాథ్ సాథ్ హై' వంటి సినిమాల్లోని సంగీతం సైతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.
'మైనే ప్యార్ కియా' దగ్గర్నుంచి దాదాపు దశాబ్దం పాటు తన సినిమాల్లోని పాటలను ప్రముఖ నేపథ్యగాయకుడు ఎస్.పి. బాలసుబ్రమణ్యంతో రామ్‌లక్ష్మణ్ పాడించటం విశేషం.
తెలుగులో కష్ణ, రమేష్‌బాబు నటించిన 'నా ఇల్లే నా స్వర్గం' చిత్రానికి ఆయన సంగీతం అందించటం మరో విశేషం.హిందీ, మరాఠీ, భోజ్‌పురి, తెలుగు భాషల్లో దాదాపు 150కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన లెజెండరీ సంగీత దర్శకుడు రామ్‌లక్ష్మణ్ మతిపట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
నేను నటించిన 'మైనే ప్యార్ కియా', 'పత్తర్ కే ఫూల్', 'హమ్ ఆప్కే హై కౌన్', హమ్ సాథ్ సాథ్ హై' వంటి సంచలన విజయం సాధించిన చిత్రాలకు సంగీతం అందించిన రామ్‌లక్ష్మణ్ ఇకలేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.
- సల్మాన్‌ఖాన్
బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రామ్‌లక్ష్మణ్ కన్నుమూశారని తెలిసింది. ఆయన మరణవార్త నన్నెంతగానో కలచివేసింది. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన సంగీత దర్శకత్వంలో ఎన్నో పాపులర్ పాటలు పాడే అదృష్టం దక్కింది. సంగీత ప్రపంచం ఓ దిగ్గజాని కోల్పోయింది.
- లతా మంగేష్కర్