Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం 'పెళ్ళిసందడి'. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రమిది. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కష్ణ మోహన్ రావు సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. గౌరి రోణంకి దర్శకురాలు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. ఆదివారం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పుట్టినరోజు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ చిత్రంలోని 'బుజ్జులు..బుజ్జులు..' అంటూ సాగే రెండో పాటను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
'పాలకుండ నెత్తినెట్టి పంజగుట్ట పోతవుంటే.. బోరబండ పోరగాడు రాయి పెట్టి కొట్టినాడు..బుజ్జులు బుజ్జులు కొనిపెడతా బంగరు గజ్జెలు...' అంటూ ప్రేయసిని ప్రేమికుడు ఏడిపించడం. మళ్లీ ఆమె అలక తీర్చడానికి ఆమెకు ఇష్టమైనవన్నీ కొని పెడతానని అని చెప్పే వైనం.. అలాగే విజువల్గానూ ఈ పాట దర్శకేంద్రుడిని మార్క్‌ని మరోమారు రీకాల్ చేస్తోంది. ఈ సందర్భంగా దర్శకురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ, 'శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావుగారి పర్యవేక్షణలో నేను డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. ఈ చిత్రం నుంచి 'బుజ్జులు..' పాటను దర్శకేంద్రుడి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్‌గా నాకు ఇదొక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. సినిమా చాలా బాగా వస్తోంది. అలాగే రాఘవేంద్రరావు, కీరవాణిగారి సూపర్ హిట్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రంలోని ప్రతి పాట తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇటీవల విడుదలై మెప్పించిన తొలిసాంగ్ మాదిరిగానే ఈ పాట కూడా మెప్పిస్తుంది' అని అన్నారు.
'రాఘవేంద్రరావు, కీరవాణి కాంబోలో ఎన్నో మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అదే కోవలో ఇది కూడా నిలుస్తుంది. 7 రోజులు ప్యాచ్‌వర్క్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. జూన్ లేదా జులైలో మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నాం' అని నిర్మాతలు తెలిపారు.