Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సినిమా చరిత్రలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుది ఓ ప్రత్యేక స్థానం. ఎన్నో సంచలన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన దిగ్దర్శకుడు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి తన ట్వీట్లో, 'రాఘవేంద్రరావుగారి సినీ ప్రస్థానంలో అత్యధిక చిత్రాల హీరోగా నాకూ ఓ ప్రత్యేకత లభించింది. మా కాంబినేషన్ ఎంతో స్పెషల్. నా స్టార్ డమ్‌ని, కమర్షియల్ స్థాయిని పెంచిన దర్శకుడు. తెలుగు చిత్రాల్లో ఎప్పటికీ అపురూపంగా నిలిచే 'జగదేకవీరుడు అతిలోక సుందరి' లాంటి చిత్రాన్ని నాకు కానుకగా ఇచ్చిన దర్శకేంద్రుడికి జన్మదిన శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు. చిరంజీవి, దర్శకేంద్రుడు కాంబోలో 'మంచి దొంగ, అడవిదొంగ, రుద్ర నేత్ర, చాణక్య శపథం, యుద్ధభూమి, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు, ఇద్దరు మిత్రులు వంటి తదితర చిత్రాలొచ్చి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి.