Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా పుట్టినరోజు సందర్భంగా నా స్నేహితుడు అక్షయ్‌కుమార్ ఇచ్చిన గిఫ్ట్ నా జీవితంలో మరచిపోలేనిది' అని చెప్పారు ప్రముఖ బాలీవుడ్ నృత్య దర్శకుడు గణేష్ ఆచార్య. 'ఆదివారం నా పుట్టినరోజు. బర్త్‌డేకి ఏం కావాలని అక్కీ (అక్షరు) నన్ను అడిగారు. కరోనా లాక్డౌన్ వల్ల 1600 మంది జూనియర్ డాన్సర్లు, వయసు పైబడిన డాన్సర్లు, 2000 మంది బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వీళ్లందరికీ ఏదైన సహాయం చేస్తే బాగుంటుందని చెప్పాను.
అంతే.. అడిగిందే తడవుగా, 3600 మంది డాన్సర్లకు నెల రోజులకు సరిపడా నిత్యావసరాలతోపాటు కొంత ఆర్థిక సాయం అందిస్తానని మాటివ్వడంతోపాటు ఆచరణలోనూ పెట్టాడు' అని గణేష్ ఆచార్య తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం వేదికగా అందరీతో షేర్ చేసుకున్నారు.