Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నిక్.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు చేసే ప్రతి పని, అందులో సక్సెస్ అవ్వడానికి నువ్వు తాపత్రయ పడే విధానం..అన్నీ నాలో స్ఫూర్తిని నింపుతున్నాయి' అని తన భర్త నిక్ జోనాస్ గురించి బాలీవుడ్ నాయిక ప్రియాంక చోప్రా కితాబిచ్చింది. నిక్కి బైక్ ప్రమాదం జరిగి, రిబ్ ఫ్రాక్చర్ అయినప్పటికీ గాయాన్ని సైతం పట్టించుకోకుండా బిల్లిబోర్డ్ మిర్చి అవార్డ్స్‌కు వ్యాఖ్యాతగా వెళ్ళాడు. ఎలాంటి పరిస్థితుల్లో నిక్ హోస్ట్‌గా వెళ్ళాడో తెలియజేస్తూ ప్రియంకా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే, 'టు గెదర్ ఫర్ ఇండియా' పేరుతో కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు తన భర్త్ నిక్ జోనాస్‌తో ప్రియాంక ఏర్పాటు చేసిన ఫండ్ రైజింగ్ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రూ. 22 కోట్లని విరాళాన్ని సేకరించారు. వృత్తిపరంగానే కాకుండా సామాజిక సేవలోనూ భర్త నిక్ తనకు ఆదర్శమని ప్రియాంక తెలిపింది.