Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంపూర్ణేష్‌బాబు హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'బజార్ రౌడీ'. కె.ఎస్. క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వసంత నాగేశ్వరావు దర్శకుడు. ఈ సినిమాలోని రెండవ పాటని చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది.
'నీ ఒంటికి మెరుపులు బాగా చుట్టేశావే..
నా కంటికి ఏవో రంగులు చూపించావే..
పిల్లా నా మతి చెడగొట్టావే .. వద్దన్నా నను పడగొట్టావే..' అంటూ సాగే ఈ పాటను హీరో, హీరోయిన్లు సంపూర్ణేష్ బాబు, మహేశ్వరి వద్దిపై డ్యూయట్‌గా చిత్రీకరించాం. ఈ పాటకి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఈ పాటలో సంపూ క్లాసిక్ స్టెప్పులు అందరినీ మెస్మరైజ్ చేస్తాయి. మా సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్, మొదటి సాంగ్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావటం విశేషం. మా చిత్ర టీజర్ రెండు మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకోవడంతో చిత్ర విజయంపై మరింత నమ్మకం పెరిగింది. సంపూర్ణేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. సీనియర్ రైటర్ మరుధూరి రాజా రాసిన మాటలు, ఎడిటర్ గౌతంరాజుగారి అసమాన ప్రతిభ మా చిత్రానికి అదనపు ఆకర్షణలు. ఎస్ఎస్ ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చిన మా సినిమాకి ఎ.విజరు కుమార్ అందించిన సినిమాటోగ్రఫీ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతోంది. సంపూ సినిమాలో ఏ ఏ అంశాలు ఉండాలని ప్రేక్షకులు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. తన మ్యాజికల్ యాక్టింగ్‌తో ఆయన రెట్టింపు వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. 'బజార్ రౌడీ'గా వెండితెరపై ఆయన విశ్వరూపాన్ని చూడబోతున్నాం. అలరించే కంటెంట్‌తో మా దర్శకుడు వసంత నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. కరోనా తీవ్రత తగ్గిన వెంటనే మా చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. నాగినీడు, షియాజిషిండే, పథ్వి, షఫి, సమీర్, మణిచందన, నవీన, పద్మావతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తిక్, ఫైట్ మాస్టర్: జాషువా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శేఖర్ అలవలపాటి.