Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏక్ మినీ కథ' ట్రైలర్ చూశా.
చాలా చాలా ఆసక్తికరంగా ఉంది' అంటూ అగ్ర కథానాయకుడు రామ్‌చరణ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది'
అని అంటున్నారు
'ఏక్ మినీ కథ' చిత్ర దర్శక, నిర్మాతలు.
అమెజాన్ ప్రైమ్ వీడియో సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగ్ మాస్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఏక్ మినీ కథ'. ప్రస్తుత సెకండ్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీి పద్ధతిలో ఈనెల 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు.
'ఇప్పటికే విడుదలైన మా చిత్ర ప్రమోషన్ కంటెంట్‌కి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మా సినిమా ట్రైలర్ చూశానని, చాలా ఆసక్తికరంగా ఉందంటూ రామ్‌చరణ్ పోస్ట్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇటీవల స్టార్ హీరో ప్రభాస్ సైతం మా చిత్ర బందానికి సామాజిక మాధ్యమం వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దీంతో మా సినిమాపై అందరిలోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి అద్భుతమైన కథ అందించారు. సంతోష్ శోభన్, కావ్య తప్పర్ జంటగా ప్రేక్షకులందర్నీ అలరించే రీతిలో ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ రాపోలు తెరకెక్కించారు. మంచి కంటెంట్, వినోదం ఉన్న కథతో వస్తున్న మా చిత్రం కచ్చితంగా అందర్నీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది' అని నిర్మాతలు తెలిపారు.