Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాలర్ల బతుకు చిత్రంగా రూపొందుతున్న సినిమా 'జెట్టి'. వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుబ్రహ్మణ్యం పిచ్చుకని దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణుమాధవ్ నిర్మిస్తున్న చిత్రమిది. నాలుగు భాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలోని మొదటి సాంగ్‌ని మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ కొండకండ్ల స్టూడియోలో డైరెక్టర్ వేణ ఉడుగుల ఆవిష్కరించారు. అలాగే ఈ సినిమా కథ తెలుసుకుని ఆయన చాలా ఉద్వేగానికి లోనయ్యారు.
ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ,'ఈ సినిమాలోని 'దూరం కరిగినా..' పాటని శ్రీమణి గారు మంచి సాహిత్య విలువలతో రాశారు. అలాగే ఈ పాటలోని కొన్ని షాట్స్ చూశాను. చాలా చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ విలువలు సైతం బాగున్నాయి. ఇది జీవితాల్లోంచి పుట్టిన కథ. మత్స్యకారుల జీవితాల్లోని కన్నీటి అలలు.. సమస్యల సుడిగుండాలని విశదీకరించే అద్భుతమైన కథా వస్తువు తీసుకుని ఈ సినిమాని నిర్మించారు. కథ విన్నాను. సినిమా విజయవంతమై, నిర్మాతకి రెట్టింపు లాభాలు రావాలని ఆశిస్తున్నాను' అని అన్నారు. 'శ్రీమణి రాసిన 'దూరం కరిగినా.. మౌనం కరుగునా.' పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు. ఈ మోలోడీ తప్పకుండా అందరికీ నచ్చుతుంది. సినిమాలో వచ్చే మొదటి పాట ఇది' అని సంగీత దర్శకుడు కార్తిక్ కొండకండ్ల తెలిపారు. దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుకు మాట్లాడుతూ,'ఇప్పటి వరకూ ఎవరూ చూపని కథ ఇది. సంగీతం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఆల్బమ్‌లోని అన్ని సాంగ్స్ ఆకట్టుకుంటాయి. సిద్ శ్రీరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దూరం కరిగినా .. పాటతో 'జెట్టి' మ్యూజకల్ జర్నీ స్టార్ట్ అయ్యింది. సూపర్ హిట్ అల్బమ్‌ని అందించబోతున్నాం అనే నమ్మకం మా టీం అందరికీ ఉంది' అని చెప్పారు. నందిత శ్వేత, కష్ణ, కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్ యస్ చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ షెట్టి తదితరులు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం.