Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఈలం తమిళులకు సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలున్నాయని, తమిళ సంప్రదాయాన్ని, తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్సిరీస్ని బ్యాన్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ఐటీ మినిస్టర్ తంగరాజ్ లేఖ రాశారు. దీనికి కేంద్ర సమాచార ప్రసార శాఖ స్పందించి, త్వరలోనే సమాధానమిస్తామని తెలిపింది. రాజ్, డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో తమిళ ఉగ్రవాదిగా సమంత నటించింది. ట్రైలర్లో ఐఎస్ఐతో తమిళ ఈలంకు సంబంధాలున్నట్లు ఓ డైలాగ్ ఉండటంతో వివాదం మొదలైంది. అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 4న ఈ వెబ్‌సిరీస్ విడుదల కానుంది.