Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖుల వరుస మరణాలు తెలుగు చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచేస్తున్నాయి. విషాదంలో నుంచి తేరుకోకముందే మరో అభిరుచిగల నిర్మాతను చిత్రసీమ కోల్పోవడం బాధాకరం. ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కష్ణకుమార్ (66) బుధవారం ఉదయం గుండెపోటుతో విశాఖలో కన్నుమూశారు.
తరుణ్ హీరోగా జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో 'సఖియా నాతో రా'తోపాటు 'ఈ పిల్లకి పెళ్ళవుతుందా', 'కలికాలం ఆడది', 'డామిట్ కథ అడ్డం తిరిగింది', 'ఈ దేశంలో ఒకరోజు', అలాగే దర్శకుడు మారుతితో కలిసి 'బెస్ట్ యాక్టర్స్' చిత్రాన్ని నిర్మించారు. కష్ణకుమార్ భార్య జ్యోతి కొన్నేళ్ళ క్రితం కన్నుమూశారు. 'వంశ వక్షం', 'తూర్పు వెళ్ళే రైలు', 'మరో మలుపు', 'మల్లె పందిరి' తదితర చిత్రాలలో ఆమె కథానాయికగా నటించారు. కష్ణకుమార్, జ్యోతి దంపతులకు ఓ కుమార్తె ఉన్నారు.మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా నటించిన ఓ చిత్రాన్ని 'అనుకోని అతిథి'గా తెలుగు ప్రేక్షకులకు కష్ణకుమార్ అందించబోతున్నారు. ఈనెల 28న ఆహా ఓటీటీ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. అలాగే ప్రస్తుతం మలయాళం సూపర్ హిట్ సినిమా 'తన్నీర్ మతన్ దినంగల్'ను తెలుగులో రీమేక్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో కష్ణకుమార్ హఠాన్మరణం బాధాకరమని, అభిరుచిగల నిర్మాతని కోల్పోయామని పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.