Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం '18 పేజీస్'. అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా, అగ్ర దర్శకుడు సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. జూన్ 1న హీరో నిఖిల్ పుట్టినరోజు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ఓ అప్డేట్ పోస్టర్ని సోషల్ మీడియా వేదికగా బుధవారం షేర్ చేసింది. ఓ అబ్బారు చేతిలో ఫోను, ఓ అమ్మాయి చేతిలో పెన్ ఉన్న స్టిల్స్‌తో ఉన్న ఈ అప్డేట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.