Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మిషన్ ఇంపాజిబుల్ -7' హాలీవుడ్ సినిమాలో టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా ఇదొక హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇది నిజమా? కాదా.. అనే విషయాన్ని నిర్ధారించకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాల్లో టాలీవుడ్ టు హాలీవుడ్ స్టార్ ప్రభాస్ అంటూ స్టోరీలు రాశారు. కానీ ఓ నెటిజన్ మాత్రం తన సందేహాన్ని నివృత్తి చేసుకోవాలని 'మిషన్ ఇంపాజిబుల్ -7' దర్శకుడు క్రిస్టోఫర్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
'మీరు తెరకెక్కిస్తున్న 'మిషన్ ఇంపాజిబుల్-7'లో ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కీ రోల్ పోషించనున్నారంటూ గత కొంతకాలంగా ఇక్కడ పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దయచేసి ఇందులో ఎంత నిజముందో చెప్పగలరు?' అని నెటిజన్ అడిగిన ప్రశ్నకు, 'ప్రభాస్ ఎంతో టాలెంట్ కలిగిన నటుడు. కానీ ఇప్పటి వరకూ ఆయన్ని నేను కలవలేదు' అని క్రిస్టోఫర్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రభాస్ హాలీవుడ్ 'ఎమ్ఐ7'లో నటించడం లేదని స్పష్టమైంది. దీంతో 'రాధేశ్యామ్' కోసం ఇటలీ వెళ్ళినప్పుడు ప్రభాస్‌కి క్రిస్టోఫర్ కథ చెప్పడం, అది నచ్చి.. టామ్ క్రూజ్‌తో ప్రభాస్ కొన్ని అదిరిపోయే యాక్షన్ సన్నివేశాల్లోనూ నటించడం.. ఇవన్ని ఒట్టి ట్రాష్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.
ప్రభాస్ ప్రస్తుతం 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్', 'సలార్' వంటి పాన్ ఇండియా చిత్రాలతో పాటు నాగ్ అశ్విన్‌తో చేయబోయే పాన్ వరల్డ్ సినిమాతోనూ బిజీగా ఉన్నారు.