Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలోనే అత్యంత భారీ చిత్రం 'ఆర్ఆర్ఆర్'కి సంబంధించి డిజిటల్, శాటిలైట్ రైట్స్ దక్కించుకోవడం ఆనందంగా ఉందని పెన్ స్టూడియోస్ సంస్థ బుధవారం అధికారికంగా ఓ ప్రకటనలో తెలిపింది.
థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రసారం కానున్న డిజిటల్ (ఓటీటీ), శాటిలైట్ (టీవీ ఛానెల్) పార్టనర్స్‌కి సంబంధించి పూర్తి వివరాలను పెన్ స్టూడియోస్ ఆ ప్రకటనలో పేర్కొంది.
ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే.
డిజిటల్ (ఓటీటీ)
1) జీ 5లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
2) హిందీలో నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రసారం చేయనుంది.
3) వరల్డ్ వైడ్‌గా ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, తుర్కిష్, స్పానిష్ భాషల్లోనూ నెట్ ఫ్లిక్స్ అనువాదం చేసి స్ట్రీమింగ్ చేయనుంది.
శాటిలైట్
1) జీ సినిమా (హిందీ)
2) ఏషియానెట్ (మలయాళం)
3) స్టార్ ఛానెల్స్ తెలుగుతోపాటు తమిళం, కన్నడ వర్షెన్స్ని ప్రసారం చేయనున్నాయి.
భారతదేశంలోనే అత్యంత భారీ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్'ని పేర్కొంటూ, ఈ చిత్ర డిజిటల్, శాటిలైట్ హక్కుల్ని తమకి ఇచ్చినందుకు నిర్మాత డి.వి.వి.దానయ్య, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి పెన్ స్టూడియోస్ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.
అయితే ఈ హక్కుల్ని దక్కించుకోవడానికి పెన్ స్టూడియోస్ సంస్థ ఊహించని భారీ మొత్తాన్నే చెల్లించినట్టు తెలుస్తోంది.
కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్న ఈ ఫిక్షనల్ పీరియాడికల్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలివియా మోరీస్, రామ్‌చరణ్‌కి జోడిగా బాలీవుడ్ నాయిక అలియాభట్ నటిస్తున్నారు. అజరుదేవగన్, సముద్రకని ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల స్థాయిలోనే సినిమా ఉంటుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తోంది.