Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం మహేష్‌బాబుకి మొదట్నుంచీ ఆనవాయితీ. అయితే ఈసారి ఆనవాయితీకి కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ వేసింది.
మహేష్ కొత్తగా నటిస్తున్న ఃసర్కారువారి పాటః సినిమా ఫస్ట్‌లుక్ కోసం అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. కష్ణ పుట్టినరోజు సందర్బంగా ఈనెల31న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ కచ్చితంగా రిలీజ్ అవుతుందని ఆశించారు. ఈ నేపథ్యంలో గురువారం మహేష్ టీమ్ చేసిన ప్రకటనతో అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు.
అలాగే త్రివిక్రమ్‌తో మహేష్ చేయబోతున్న కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ ఎనౌన్స్మెంట్ కూడా ఉండదని అర్థమవుతోంది. ఃఅతడుః, ఃఖలేజాః సినిమాల తర్వాత త్రివిక్రమ్‌తో మహేష్ చేస్తున్న మూడో సినిమా కావడంతో అందరూ ఈ సినిమా టైటిల్ కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఃసమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దష్టిలో ఉంచుకుని, తమ తదుపరి సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని చిత్రబందం భావించింది. సినిమా అప్డేట్ గురించి ఎవరూ కూడా అనధికారికంగా, అవాస్తవాలను దయచేసి సష్టించవద్దు. సినిమాకి సంబంధించిన ఏ అప్‌డేట్‌నైనా అధికారిక ఖాతాల్లో తప్పకుండా పోస్ట్ చేస్తాం. అప్పటివరకూ దయచేసి జాగ్రత్తగా ఉండండి. సురక్షితంగా జీవించండిః అని ఃసర్కారువారి పాటః చిత్ర యూనిట్ ట్వీట్లో వివరించింది.
ఃసరిలేరు నీకెవ్వరుః వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం ఃసర్కారువారి పాటః. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేష్ కథానాయిక. దుబారులో ఓ షెడ్యూల్ జరుపుకున్న ఈసినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది.