Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మహానటి' తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు దక్కపోయినా కీర్తిసురేష్‌కి మాత్రం ఆఫర్ల మీద ఆఫర్లు రావడం విశేషం.
ఓ పక్క బడా హీరోల సరసన కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే మరోపక్క మహిళా ప్రధాన చిత్రాల్లోనూ కీర్తి నటిస్తుండటం మరో విశేషం.
ప్రస్తుతం మహేష్ సరసన 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్న
కీర్తి లేటెస్ట్గా మరో సినిమాకి గ్రీన్‌సిగల్ ఇచ్చినట్టు సమాచారం.
తమిళ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి ఓ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం విదితమే. దిల్‌రాజు నిర్మిస్తున్న
ఈ చిత్రం ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో
నిర్మితం కానుంది. ఇందులో విజరు సరసన కీర్తిని
ఎంపిక చేశారట. గతంలో 'సర్కార్', 'భైరవ' చిత్రాల్లోనూ విజరు సరసన కీర్తి మెరిసింది. తాజా సినిమాతో ముచ్చటగా మూడోసారి ఈ జోడీి సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోందని టాక్. దీంతోపాటు రజనీకాంత్ 'అన్నాత్తే', దర్శకుడు నగేష్ కుకునూర్ 'గుడ్‌లక్ సఖీ' చిత్రంలోనూ
కీర్తి నటిస్తోంది.