Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమిత్ తివారీ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'నల్లమల'. రవి చరణ్ దర్శకుడు. నల్లమల అటవీ ప్రాంతపు వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని హీరో అమిత్ తివారీ లుక్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ లుక్‌లో అమిత్ ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. నల్లమల ప్రాంతపు జీవన విధానం అమిత్ క్యారెక్టర్ రూపురేఖల్లో కనిపిస్తోంది. అయితే అతని కోపానికి, ఉద్వేగానికి కారణమేంటి అనేది మాత్రం వెండితెరపైనే చూడాలంటున్నారు దర్శకుడు రవిచరణ్. ఈ సినిమా గురించి దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ, 'నల్లమల భూమి బిడ్డ అమిత్ తివారీ. నిగూఢమైన నల్లమల అడవి లాంటిది ఆయన క్యారెక్టర్. దట్టమైన ఆ అటవీ ప్రాంతమంత స్వచ్ఛమైనది ఆయన వ్యక్తిత్వం. ప్రపంచాన్ని శాసించే ఆయుధం తయారి కోసం నల్లమల వచ్చిన ఇరాన్ సైంటిస్ట్ నాజర్ని, అమిత్ తివారీ ఎలా ఎదిరించాడు?, అటవీ సంపదను ఎలా కాపాడాడు అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది' అని చెప్పారు. భానుశ్రీ, తనికెళ్ల భరణి, అజరు ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, ఛలాకీ చంటి, ముక్కు అవినాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : శివ సర్వాణి, ఫైట్స్ : నబా, ఆర్ట్ : యాదగిరి, సినిమాటోగ్రఫీ : వేణు మురళి, సంగీతం, పాటలు : పి.ఆర్, నిర్మాత : ఆర్.ఎమ్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రవి చరణ్.