Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి బాలకృష్ణ ఓ అద్భుతమైన కానుకని ప్రేక్షకులు, అభిమానులకు అందించబోతున్నారు. ఆయన అలపించిన 'శ్రీరామ దండకం'ను ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేడు (శుక్రవారం) రిలీజ్ చేయబోతున్నారు. నటుడిగా బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. ఇక గాయకుడిగానూ ఆయన సుపరిచితుడే. అవకాశం దొరికినప్పుడల్లా తనలోని గాయకుడి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. ఇందులో భాగంగానే గతంలో తన పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ నటించిన 'జగదేకవీరుని కథ' సినిమాలోని 'శివ శంకరీ శివానంద లహరి' పాటను పాడి అలరించారు. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన హీరోగా తెరకెక్కిన 'పైసా వసూల్' చిత్రంలో పాడిన పాట మాస్ ప్రేక్షకుల్ని ఊర్రూతలూగించింది. ఇక తాజాగా ఆయన 'శ్రీరామ దండకం'తో అందర్నీ మెప్పించే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' చిత్రంలో బాలయ్య నటిస్తున్నారు.