Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బోల్డ్.. కానీ చాలా సున్నితమైన కాన్సెప్ట్. అయినప్పటికీ గట్టి నమ్మకంతో 'ఏక్ మినీ కథ'లో నటించా. ఆ నమ్మకం విజయం రూపంలో నిజమైంది' అని అంటున్నారు హీరో సంతోష్‌శోభన్. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'ఏక్ మినీ కథ'. కార్తీక్ రాపోలు దర్శకుడు. సంతోష్‌శోభన్, కావ్యతప్పర్ జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై హిట్ టాక్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ శుక్రవారం మీడియాతో తన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. 'పురుషాంగం చిన్నదనే సందేహంతో బాధపడే ఓ కుర్రాడి కథ అంటూ మేర్లపాక గాంధీగారు ఈకథని నాకు నెరేట్ చేశారు. ఇందులో నా పాత్ర ఎదుర్కొనే సమస్య నాకు బాగా నచ్చింది. కథ, నా పాత్ర మీద నమ్మకంతో గ్రీన్‌సిగల్ ఇచ్చా. బోల్డ్.. బట్ బ్యూటీఫుల్‌గా చూపించారంటూ సినిమా చూసిన వాళ్ళందరూ అభినందిస్తున్నారు. సున్నితమైన కాన్సెప్ట్ అయినప్పటికీ కుటుంబ సమేతంగా మా సినిమాని కంఫర్టబుల్‌గా చూడ్డం మరింత హ్యాపీగా ఉంది. ఇలాంటి కాన్సెప్ట్‌ని దర్శకుడు హ్యాండిల్ చేసిన విధానం, సంగీతం, యష్ మాస్టర్ డాన్స్, యువి బ్యానర్ నిర్మాణ విలువలు బాగా ప్లస్ అయ్యాయి. నటనపరంగానూ నాకూ మంచి మార్కులు పడ్డాయి. నా కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్. ప్రస్తుతం యువి బ్యానర్లోనే మరో సినిమా చేస్తున్నాను. అలాగే వైజయంతి మూవీస్, సితార ఎంటర్టైన్మైంట్స్లో సినిమాలను అంగీకరించాను' అని సంతోష్ శోభన్ చెప్పారు.