Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి కళ్యాణ్ హీరోగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికష్ణ.కె నిర్మిస్తున్న చిత్రానికి 'బింబిసార' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనేది ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న 18వ చిత్రమిది. శుక్రవారం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మైథలాజికల్ టచ్‌తో ఉన్న 'బింబిసార' టైటిల్ మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. క్రూరుడైన బింబిసారుడు లుక్‌లో యుద్ధ రంగంలో శత్రు సైనికులను చంపి, వారి శవాలపై ఠీవిగా కూర్చున్న కళ్యాణ్ రామ్ లుక్ అలరిస్తోంది. కళ్యాణ్ రామ్ ఇలాంటి మైథిలాజికల్ పాత్రలో నటిస్తుండటం ఇదే తొలిసారి. అలాగే ఆయన ఆ క్యారెక్టర్ లుక్, బ్యాక్‌డ్రాప్ సినిమాపై అందరిలోనూ మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. 'గత ఏడాది చిత్రీకరణ స్టార్ట్ చేశాం. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కీలకంగా ఉంటాయి. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే భారీ సెట్స్‌తో, భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందుతున్న చిత్రమిది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రస్తుతం చిత్రీకరణ ఆగింది. కోవిడ్ పరిస్థితులు చక్కబడగానే చిత్రీకరణ ఆరంభిస్తాం. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చిత్ర యూనిట్ తెలిపింది.
కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్ ట్రెస్సా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: సిరి వెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, డాన్స్: శోభి, రఘు, ఫైట్స్: వెంకట్, రామకష్ణ, వి.ఎఫ్.ఎక్స్: అనిల్ పడూరి, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, ఎడిటర్: తమ్మిరాజు, మ్యూజిక్: చిరంతన్ భట్, సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు, దర్శకత్వం: వశిష్ఠ్.