Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
వైద్య సేవలు ప్రజలకు ఉచితంగా వైద్యం సేవలు అందించాలని, ప్రజల ప్రాణాలు కాపాడండి ప్రజల్ని ఆదుకోండి అని ఏఐవైఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి.రంజిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న తరుణంలో మన దేశ ప్రజల స్థితిగతులు దెబ్బతిన్న తరుణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవకపోవడం దారుణమని అన్నారు. కేంద్ర,రాష్ట్రా ప్రభుత్వలు కరోనా పరీక్షలు విస్తృతంగా చేపట్టాలని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని కరోనా, బ్లాక్ ఫంగస్ వంటి వైద్య సేవలు ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని అన్నారు. రేషన్ షాపుల ద్వారా 17 రకాల నిత్యావసరాల సరుకులను ప్రజలకు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. కరోనా తో మరణించిన వారికి తక్షణ సహాయం కింద 10 వేలు, ఆర్థిక సహాయం 10 లక్షల ఎక్స్గ్రేషియా వారి కుటుంబానికి అందించాలని అన్నారు. కరోనాతో తల్లిదండ్రులు మరణించిన వారి పిల్లల బాధ్యత, భద్రత వారి జీవితకాలం ప్రభుత్వం కల్పించాలని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల కార్పోరేట్ మాఫియాను, అంబులెన్స్ అధిక ఫీజుల ఆగడాలను అరికట్టాలని కోరారు. పౌరులందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందించాలి, ప్రతి కుటుంబానికి కరోనా విపత్కర పరిస్థితుల్లో నెలకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అన్నారు.