Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'జీవితమంటే పరుగు పందెం కాదు. ప్రియమైన వారికి విలువ ఇస్తూ, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. ఇదే నాకు కరోనా నేర్పిన గుణపాఠం' అని చెబుతోంది కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్. కోవిడ్ బారిన పడిన కథానాయికల్లో రకుల్ కూడా ఒకరు. వైద్యుల సూచనలతోపాటు తన మనోధైర్యంతో కోవిడ్‌ని జయించారు. ఈ నేపథ్యంలో కోవిడ్ తనకి ఏం నేర్పిందనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రకుల్ షేర్ చేసింది. 'కరోనా మొదటి వేవ్ సమయంలో దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపైనే దృష్టి పెట్టాం. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన నిస్సహాయిలను ఎలా ఆదుకోవాలా అని మాత్రమే ఆలోచించాం. లాక్డౌన్ తర్వాత సాధారణ జీవితాన్ని ప్రారంభించాం. అయితే శత్రువు ఇంకా మనల్ని వదిలి పెట్టలేదని మాత్రం తెలుసుకోలేకపోయాం. నిర్లక్ష్యం చేసి ప్రస్తుత మహావిషాదానికి సాక్ష్యంగా నిలిచాం. లెక్కలేనన్ని మరణాలు మనలో భయాన్ని పుట్టిస్తున్నాయి. అందుకే ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అందరిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మన జీవితం అనిశ్చితమైనది, అనూహ్యమైనది. జీవితం పరుగు పందెం కాదని సెకండ్ వేవ్ మనకి గుణంపాఠం నేర్పింది' అని రకుల్ తెలిపింది. ప్రస్తుతం హిందీలో 'మేడే', 'థ్యాంక్ గాడ్', 'ఎటాక్' చిత్రాల్లోను, తెలుగులో వైష్ణవ్ తేజ్‌తో కలిసి క్రిష్ దర్శకత్వంలో రకుల్ ఓ సినిమాలో నటించింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.