Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్త జంట, శ్రీరస్తు శుభస్తు, ఏబీసీడీ, ఒక్క క్షణం వంటి వినూతన్నమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు యువ కథానాయకుడు అల్లు శిరీష్. తాజాగా తన అల్లు శిరీష్ ప్రొడక్షన్ నెం 6 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో అను ఇమ్మాన్యుయెల్ నాయిక. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మితమవుతోంది.
'ఈనెల 30 అల్లు శిరీష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ వివరాలను తెలియజేస్తూ ఇటీవలే రిలీజ్ చేసిన ప్రీ లుక్ పాన్ ఇండియా వైడ్ హాట్ టాపిక్ అయింది. ఇదే ఉత్సాహంతో తాజాగా మరో ప్రీలుక్‌ని విడుదల చేసి, సరికొత్త ట్రెండ్‌కి అల్లు శిరీష్ నాంది పలికారు. అల్లు శిరీష్, అనుఇమ్మాన్యుయెల్ మధ్య నడిచే రొమాన్స్ నేపథ్యంలో రిలీజైన ఇంటెన్స్ ప్రీలుక్ 2గా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ ప్రీలుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈనెల 30న విడుదల కాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పై అంతటా ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాకి దర్శకుడెవరు?, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి' అని చిత్ర బృందం చెప్పింది.