Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' (ఎవరు,ఎక్కడ,ఎందుకు). అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి.రాజు దాట్ల నిర్మిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో అందరిలో చిన్న పాటి ధైర్యాన్ని తీసుకురావడానికి 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' యూనిట్ ఇటీవల లాక్డౌన్ ర్యాప్ వీడియో సాంగ్‌ను విడుదల చేసింది. రోల్ రైడా పాడిన ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని 'కన్నులు చెదిరే...' లిరికల్ వీడియో సాంగ్‌ను యువ కథానాయకుడు అడివి శేష్ విడుదల చేసి, చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'కన్నులు చెదిరే అందాన్ని..వెన్నెల తెరపై చూశానే, కదిలే కాలాన్నే నిమిషం నిలిపేశానే..' అంటూ ఈ సాగే ఈ రొమాంటిక్ మెలోడీ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ గీతాన్ని యాజిన్ నిజార్ ఆలపించారు. సైమన్ కె కింగ్ స్వరాలు సమకూర్చారు. దీని గురించి చిత్ర దర్శకుడు కేవి గుహన్ మాట్లాడుతూ, 'ఫస్ట్ కంప్యూటర్ స్క్రీన్ తెలుగు మూవీ. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తప్పకుండా థ్రిల్లర్ జోనర్‌లోనే ఇది ఒక డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది' అని అన్నారు. 'సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిన టీజర్, స్టార్ హీరోయిన్ తమన్నా రిలీజ్ చేసిన 'నైలు నది..' సాంగ్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. రీసెంట్గా రిలీజైన లాక్డౌన్ ర్యాప్ సాంగ్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 'కన్నులు చెదిరే..' సాంగ్‌ను హీరో అడివి శేష్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ చక్కగా నటించారు. గుహన్ గారు ఈ సినిమాని అద్బుతంగా తెరకెక్కించారు. తప్పకుండా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది' అని చిత్ర నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల చెప్పారు.-ప్రొడ్యూసర్ విజరు ధరన్ దాట్ల మాట్లాడుతూ, 'గుహన్ గారు ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ చేయడానికి చాలా డెడికేటెడ్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్‌గా జరుగుతోంది. ఈ కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తాం' అని తెలిపారు.