Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుత కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్యా అనేక సినిమాలు డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కొన్ని ఇప్పటికే విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో తమ 'ఎస్.ఆర్.కళ్యాణ మండపం, ఇఎస్టీడీ1975' చిత్రాన్ని థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రమోద్, రాజు తెలిపారు. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జంటగా శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది.
'ఈ సినిమా టైటిల్‌ని ఎనౌన్స్ చేసిన దగ్గర్నుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఓ అసక్తిని క్రియేట్ చేసింది. ఆ ఉత్కంఠని మరింత పెంచుతూ 'చుక్కల చున్ని..', 'చూశాలే కళ్లార..' వంటి పాటలు యూట్యూబ్‌లో మిలయన్స్ వ్యూస్‌తో సోషల్ మీడియాలో సైతం ట్రెండింగ్ అయ్యాయి. అలాగే టీజర్‌కి సైతం అనూహ్య స్పందన రావడంతో టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా ఒక హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ని సైతం కిరణ్ అబ్బవరం అందించడం విశేషం. విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ పోషించిన కీలక పాత్ర మా చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇప్పటి పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చి, థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు మా సినిమాని విడుదల చేస్తాం' అని దర్శకుడు శ్రీధర్ గాదే చెప్పారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సంగీతం : చేతన్ భరద్వాజ్, కెమెరా : విశ్వాస్ డేనియల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భరత్, లిరిక్స్ : భాస్కరభట్ల, క్రిష్ణకాంత్, ఆర్ట్ : సుధీర్, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : కిరణ్ అబ్బవరం, నిర్మాతలు : ప్రమోద్, రాజు, దర్శకుడు : శ్రీధర్ గాదే.