Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం '18 పేజీస్'. 'కుమారి 21 ఎఫ్' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ప్రీ లుక్‌కి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ మాట్లాడుతూ,''18 పేజీస్' అనే టైటిల్ ఈ సినిమాకి ఫిక్స్ చేసినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. అలానే స్టార్ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండటం, 'కుమారి 21 ఎఫ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం, నిఖిల్ - అనుపమా పరమేశ్వరన్ కాంబినేషన్, జీఏ2 పిక్చర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణం.. వెరసి ఈ ప్రాజెక్ట్‌పై అందరిలో మరింత ఆసక్తి, ఆంచనాలు పెంచుతున్నాయి. జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేయడానికి దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అప్ డేట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అలాగే తాజాగా ప్రీ లుక్ విడుదలైంది. నిఖిల్ కల్ట్ లుక్స్‌తో ఉన్న స్టిల్‌తో ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అయ్యింది. క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి' అని పేర్కొంది.