Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు శిరీష్, అను ఇమ్నాన్యుయెల్ జంటగా రూపొందుతున్న న్యూఏజ్ లవ్ స్టోరీ చిత్రానికి
'ప్రేమ కాదంట' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జీఏ2పిక్చర్స్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై విజరు.ఎమ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత విజరు.ఎమ్ మాట్లాడుతూ,''వినూత్నమైన కథల్ని ఎంచుకుని, తనదైన శైలిలో ఎంటర్టైన్ చేస్తూ ప్రేక్షకాదరణ పొందుతున్న హీరో అల్లు శిరీష్. ఆదివారం ఆయన బర్త్‌డే సందర్భంగా రెండు ఫస్ట్‌లుక్స్‌తో పాటు 'ప్రేమకాదంట' అనే టైటిల్‌ని ప్రకటించడం ఆనందంగా ఉంది. ప్రీలుక్స్తో ఈ చిత్రానికి వచ్చిన హైప్‌ని మరింత పెంచేలా తాజాగా విడుదల చేసిన రెండు ఫ్టస్లుక్స్ ఉండటం విశేషం. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియా, ఫ్యాన్స్‌తోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ ట్రెండ్ అవుతున్నాయి. 'విజేత' సినిమాతో అందరి దష్టిని ఆకర్షించిన దర్శకుడు రాకేశ్ శశి. ఈ చిత్రాన్ని సైతం ఆద్యంతం అందర్ని ఆకట్టుకునే రీతిలో ఆయన సిద్ధం చేస్తున్నారు' అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ - అల్లు అరవింద్, నిర్మాత - విజరు.ఎమ్, సహనిర్మాత - బాబు, ధీరజ్ మోగిలినేని, డిఓపి - తన్వీర్ మిర్, మ్యూజిక్ - అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి, ఎడిటిర్ - కార్తీక్ శ్రీనివాస్.ఆర్, ప్రొడక్షన్ డిజైనర్ - శ్రీ నాగేంద్ర తంగల.