Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రతి ఆర్టిస్ట్‌కి తన లైఫ్‌లో కొన్నిసార్లు మాత్రమే అరుదైన అవకాశాలు వస్తాయి. అలాంటి అరుదైన అవకాశం నాకు 'ఆదిపురుష్' రూపంలో వచ్చింది' అని అంటోంది బాలీవుడ్ కథానాయిక కృతిసనన్. ప్రభాస్ హీరోగా, ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న
పాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్. ఇందులో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా, సీతగా కృతిసనన్ సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతున్నారు. ఈ సినిమాతో పాటు కృతి మరో ఆరు సినిమాల్లోనూ నటిస్తోంది. అయినప్పటికీ 'ఆదిపురుష్' కోసం బాగా కష్టపడుతున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 'సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ లేనప్పటికీ 'ఆదిపురుష్'లోని నా పాత్ర తాలూకా సంభాషణలను బాగా నేర్చుకుంటున్నాను. సీత పాత్రను నేను ఎలా చేస్తానా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు' అని కృతి చెప్పింది.