Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి ఏడాది కష్ణ పుట్టినరోజు కానుకగా మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం ఆనవాయితీ. అయితే కరోనా మహమ్మారి ఆ ఆనవాయితీకి బ్రేక్ వేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 'సర్కారు వారి పాట'కి సంబంధించి అప్డేట్ ఇవ్వలేకపోతున్నట్టు మహేష్ టీమ్ ఇటీవల తెలియజేసిన విషయం విదితమే. అయితే కృష్ణ ఫ్యాన్స్‌ని ఉత్తేజపరచటానికి ఊర్వశీ ఓటీటీ సంస్థ ఓ వినూత్న ప్రయత్నం చేస్తోంది. అల్లూరి సీతా రామరాజుగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన కృష్ణపై ఆర్.పి పట్నాయక్ ఓ విప్లవ వీరుని గీతాన్ని అలపించారు. దర్శకుడు వీరు.కె ఈ పాట రూపకల్పనకు సారధ్యం వహించగా, ఆర్పి. పట్నాయక్, మౌనిక అలపించారు. ఈ పాటను కృష్ణ బర్త్‌డే సందర్భంగా నేడు (సోమవారం) ఊర్వశి ఓటీటీ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ఊర్వశి ఓటిటి ఎమ్.డి రవి కనగాల, సిఇఓ రామ సత్యనారాయణ మాట్లాడుతూ, 'తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసిన సూపర్ స్టార్ కష్ణగారిపై ఓ పాటను ఆయనకు కానుకగా, ఆయన అభిమానులకు అంకితం చేస్తూ విడుదల చేస్తుండటం మాకెంతో గర్వంగా ఉంది. మాకు ఈ అవకాశం ఇచ్చిన 'మా' అధ్యక్షులు నరేష్ గారికి కతజ్ఞతలు. మా ఊర్వశీ ఓటీటీ ద్వారా చేస్తున్న ఈ ప్రయత్నం సర్వత్రా మన్నల్ని పొందుతుందని భావిస్తున్నాం. నూతన ప్రతిభను ప్రోత్సహించడంలోను, సరికొత్త కంటెంట్‌కి కేరాఫ్‌గా నిలవడంలోనూ మా ఊర్వశీ ఓటీటీ ఇప్పటికే అందరీ ప్రశంసల్ని సొంతం చేసుకుంది' అని తెలిపారు.