Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమాలు చేసే విషయంలో అగ్ర కథానాయకుడు వెంకటేష్ దూకుడు పెంచారు. ఇప్పటికే 'దృశ్యం 2', 'నారప్ప', 'ఎఫ్3' చిత్రాల్లో ఆయన నటిస్తూ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ తాజాగా మరో కొత్త సినిమాకి గ్రీన్‌సిగల్ ఇచ్చినట్టు సమాచారం. పైగా ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని కూడా వినిపిస్తోంది. 'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. లేటెస్ట్గా వెంకటేష్ మహా చెప్పిన ఓ కథ వెంకీకి బాగా నచ్చిందట. దీంతో మూడు ప్రాజెక్టుతో బాగా బిజీగా ఉన్నప్పటికీ వెంకీ పచ్చజెండా ఊపారని టాక్. ఇదిలా ఉంటే, మలయాళ సూపర్‌హిట్ సినిమా 'డ్రైవింగ్ లైసెన్స్' రీమేక్‌లోనూ నటించేందుకు వెంకీ ఆసక్తి చూపుతున్నారనే వార్తలూ వినిపిస్తున్నాయి.