Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయికగా ప్రేక్షకుల్ని అలరించిన ప్రణీత సుభాష్ అందర్నీ సర్ప్రైజ్ చేస్తూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో అతి తక్కువ మంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఆదివారం వీరి వివాహం జరిగినట్టు తెలుస్తోంది. దీంతో ప్రణీత-నితిన్‌ల వివాహ వేడుకకు సంబంధించిన పలు ఫొటోలు వైరల్ అయ్యాయి. 'బావ', 'అత్తారింటికి దారేది', 'రభస', 'పాండవులు పాండవులు తుమ్మెద', 'బ్రహ్మోత్సవం', 'హలో గురు ప్రేమకోసమే' చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించిన ప్రణీత గతేడాది కరోనా లాక్డౌన్ సమయంలో వలస కూలీలకు ఆహారాన్ని అందించారు. అలాగే ప్రస్తుత సెకండ్ వేవ్ ఉధృతి సమయంలో అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లను అందజేసి తన మంచి మనసుని చాటుకున్నారు