Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విలక్షణ సినిమాలకు, పాత్రలకు పక్కా కేరాఫ్ విద్యాబాలన్. ఓ పక్క కమర్షియల్ సినిమాలు, మరో పక్క మహిళా ప్రధాన సినిమాలు.. నేపథ్యం, పాత్ర ఏదైనా సరే తన మార్క్ యాక్టింగ్‌తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయటంలో తనకి తానే సాటి. ఇటీవల గణిత మేధావి 'శకుంతలాదేవి'గా అలరించిన విద్యా త్వరలోనే 'షేర్నీ' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
'న్యూటన్' ఫేమ్ అమిత్ మసూర్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ను సోమవారం చిత్ర బృందం విడుదల చేసింది. 'అడవి ఎంత దూరం విస్తరించి ఉన్నా.. పులికి తన దారేమిటో తెలుసు..' అంటూ ఈ టీజర్లో విద్యా చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ అందరిలోనూ అమితాసక్తి రేకెత్తిస్తోంది. హద్దులు తెలియని అడవిలో ఇద్దరు పోలీసులతో దేని కోసమో వెతుకుతున్న అధికారిణి పాత్రలో విద్యా నటిస్తున్నట్టు టీజర్ చెప్పకనే చెప్పింది. ఒక్కమాటలో చెప్పాలంటే 'షేర్నీ' టైటిల్‌కి జస్టిఫికేషన్ చేసేలా ఈ డైలాగ్ ఉందంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈనెల 2వ తేదీన ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు.