Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయికగా నటిస్తూనే 'బార్సు' చిత్రాన్ని నిర్మించిన నిర్మాత మిత్ర శర్మ తాజాగా మరో కొత్త సినిమాని నిర్మించబోతున్నారు. శ్రీ పిక్చర్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం2గా తెరకెక్కబోయే ఈ చిత్రం ద్వారా శశి హాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి 'శ్రీలక్ష్మి' (ది ఘోస్ట్ హంటర్ అనేది ట్యాగ్ లైన్) అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారు. ఈ సందర్భంగా నాయిక, నిర్మాత మిత్ర శర్మ మాట్లాడుతూ, 'కొత్తవాళ్ళని ప్రోత్సహించాలని, ప్రేక్షకులకు క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ని అందించాలనే లక్ష్యంతో శ్రీ పిక్చర్స్ బ్యానర్‌ని ఏర్పాటు చేశాను. ఇందులో భాగంగా ప్రొడక్షన్ నెం.1గా 'బార్సు' చిత్రాన్ని దయానంద్ అనే నూతన దర్శకుడితో నిర్మించాను. యూత్‌ఫుల్ కంటెంట్‌తో అన్ని హంగుల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. తాజాగా మరో కొత్త దర్శకుడు శశి హాస్ చెప్పిన హర్రర్ కామెడీ బేస్డ్ స్క్రిప్ట్ నాకెంతో బాగా నచ్చింది. నవ్విస్తూనే ప్రేక్షకుల్ని భయపెట్టే 'శ్రీలక్ష్మి' కథేంటో వెండితెరపై చూడబోతున్నారు. దీన్ని మా బ్యానర్లోనే ప్రొడక్షన్ నెం.2గా దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించబోతున్నాను. ప్రస్తుత కరోనా పరిస్థితులు సాధారణ స్థితిలోకి రాగానే చిత్రీకరణ ఆరంభిస్తాం' అని తెలిపారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: పడవల బాలచంద్ర, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, డిఓపి : వెంకట్ ప్రసాద్, మ్యూజిక్ : స్మరన్ రచన, దర్శకత్వం: శశి హాస్, నిర్మాత : మిత్ర శర్మ.